అన్న బాటలోనే తమ్ముడు: సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్

అన్న బాటలోనే తమ్ముడు: సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్

టీమిండియాలోకి మరో యువ బ్యాటర్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. నిన్నటివరకు తన అన్న సూపర్ ఫామ్ తో అతని ప్రతిభ కనిపించకుండా పోయినా.. తాజాగా ఈ యంగ్ క్రికెటర్ ఆట దేశమంతా తెలిసింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్. అండర్ 19 టోర్నీలో అసాధారణ ఫామ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 19 ఏళ్ళ కుర్రాడు.. రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో సత్తా చాటాడు. ఈ సెంచరీతో ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. 

విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముషీర్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులే చేసి విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో సత్తా చాటాడు. క్రీజ్ లో ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసి 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ 21 ఏళ్లకు ఈ ఘనత సాధిస్తే ముషీర్ ఖాన్ కేవలం 19 ఏళ్లకే ఈ ఘనత అందుకున్నాడు. 

Also Read: జిమ్మీనే గెలికాడు.. అతడే గెలిచాడు

ముషీర్ ఖాన్ అన్న సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ముషీర్ కూడా తన బాటలోనే త్వరలోనే టీమిండియాలోకి అడుగులు వేస్తున్నాడు. ముషీర్ ఖాన్ సెంచరీతో రంజీల్లో ముంబై విజయం దిశగా దూసుకెళ్తుంది. సర్ఫరాజ్ ఖాన్ కు తోడు సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే (73), శ్రేయాస్ అయ్యర్ (95) రాణించడంతో విదర్భ ముందు 538 పరుగుల భాత్రి లక్ష్యాన్ని నిర్ధేశించింది. లక్ష్య ఛేదనలో విదర్భ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.