మ్యూజిక్ నా లైఫ్ ను మార్చింది

మ్యూజిక్ ఈజ్ ఏఆర్‌‌ రెహమాన్స్ లైఫ్. అందుకే ఆరు నేషనల్ అవార్డులు, రెండు అకాడమీ అవార్డులు, ఎన్నో ప్రశంసాపత్రాలు.. ఇలా కెరీర్‌‌లో ఎన్నో అందుకున్నారు. కానీ ఎవరూ ఇవ్వని గిఫ్టిచ్చి ఆశ్చర్యపర్చాడో అభిమాని. ‘రెహమాన్ మీ మ్యూజిక్ మ్యాజిక్ నా జీవితాన్నే మార్చేసింది. నాకు ఇంత చేసిన మీ పేరును నా డ్రీమ్ కారు గుండెలపై దాచుకుంటున్నాను’ అంటూ ఓ ట్వీట్ చేశాడు చందర్ అనే వ్యక్తి. రెహమాన్‌‌ను ట్యాగ్ కూడా చేశాడు. ఆస్ట్రేలియాలో ఉంటున్న చందర్ ఫేవరెట్ కారు బీఎండబ్ల్యూ జెడ్4. దాని నెంబర్ ప్లేట్ల పైన ‘ఐ లవ్ ఏఆర్ఆర్’ అని రాయించాడు. అతని ఫొటోలను లైక్ చేసిన రెహమాన్, ‘డ్రైవ్ సేఫ్’ అంటూ రీట్వీట్ చేశారు.

Latest Updates