శామ్‌సంగ్‌ మహా స్క్రీన్‌ : ప్రారంభించిన రెహమాన్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ఓనిక్స్‌ ఎల్‌ ఈడీ థియేటర్‌ ను మ్యూజిక్‌‌‌‌ పరికరాల తయారీ కంపెనీ హర్మాన్‌ తో కలిసి శామ్‌ సంగ్‌ బెంగళూరులో ప్రారంభించింది. స్వాగత్‌ ఓనిక్స్‌ థియేటర్‌ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ , ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ విచ్చేసి ఎల్‌ ఈడీ స్క్రీన్‌ ను ప్రారంభించారు.

స్వాగత్‌ ఓనిక్స్ థియేటర్‌ లోని శామ్‌ సంగ్‌ ఎల్‌ ఈడీ స్క్రీన్‌ ఏకంగా 14 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో618 సీట్లు ఉంటాయి. ఈ తరహా ఎల్‌ ఈడీస్క్రీన్లు  ప్రస్తుతం మలేసియా, చైనాలో మాత్రమే ఉన్నాయి. అత్యుత్తమ పిక్చర్‌ క్వాలిటీ, సహజమైన రంగులు, ధ్వని ఈ థియేటర్‌ ప్రత్యేకతలు. జేబీఎల్‌ హర్మాన్‌ సౌండ్‌ సిస్టమ్‌ వల్ల శబ్ద నాణ్యత అత్యద్భుతంగా ఉంటుందని శామ్‌ సంగ్‌ ఉన్నతాధికారి పునీత్‌ సేఠీ అన్నారు. తమ స్క్రీన్లు 3డీ, హెచ్‌ డీఆర్‌, ట్రూకలర్స్‌ వంటి టెక్నాలజీలతోనూ  పనిచేస్తాయని తెలిపారు.

Latest Updates