పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఎస్పీ బాలు కు పద్మ విభూషణ్

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దివంగత గాయకుడు SP బాలసుబ్రమణ్యంకు పద్మవిభూషణ్ ప్రకటించారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేకు విభూషన్ ఇచ్చారు. ఫేమస్ డాక్టర్ BM హెగ్డే సహా ఏడుగురికి పద్మవిభూషణ్ ఇవ్వనున్నారు. ఇక సింగర్ చిత్ర, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, దివంగత కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ లకు పద్మభూషణ్ ప్రకటించారు.

Latest Updates