చనిపోయిన హిందువుకు అంత్యక్రియలు చేసిన ముస్లింలు

ఇండియా అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. విభిన్న మతాలున్నా.. జనం కలిసే ఉంటారు. అందుకే.. ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తర్ ప్రదేశ్ హరిరామ్ పూర్ లో జరిగిన సంఘటన ఇండియా అంటే ఏంటో మరోసారి నిరూపించింది.

మొరారీ లాల్ శ్రీవాస్తవకు 65ఏళ్లు. అతడికి ఫ్యామిలీ లేదు. ఇర్ఫాన్ ఖాన్, ఫరీద్ ఖాన్ అనే వ్యక్తుల వ్యవసాయ క్షేత్రంలో మోరారీ లాల్ శ్రీవాస్తవ పనిచేస్తుండేవాడు. 15 ఏళ్లుగా వారి పొలాన్ని సాగు చేస్తున్నాడు. వారి వద్దే ఉంటున్నాడు. ఇటీవల జూన్ 13వ తేదీన ఆ పొలంలో పనిచేస్తున్న టైమ్ లో ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీవాస్తవకు ఎవరూ లేకపోవడంతో మృతదేహాన్ని ఇర్ఫాన్ ఖాన్, ఫరీద్ ఖాన్ లకు అప్పగించారు. ఆ తర్వాత.. హిందూ సంప్రదాయాల ప్రకారం… శ్రీవాస్తవ అంత్యక్రియలను ఇర్ఫాన్ , ఫరీద్ ఖాన్ కుటుంబసభ్యులు పూర్తిచేశారు.

ఇన్నేళ్లుగా తమ మధ్య ఉన్న శ్రీవాస్తవ తమ కుటుంబసభ్యుడితో సమానం అని ఇర్ఫాన్, ఫరీద్ ఖాన్ చెప్పారు. అంతేకాదు.. 11వ రోజున సంప్రదాయం ప్రకారం పెద్దకర్మ నిర్వహించారు. కార్డులు కొట్టించి గ్రామంలోని హిందూ, ముస్లిం కుటుంబాలకు పంచారు. కార్యక్రమానికి వచ్చిన హిదూ-ముస్లింలు… ఇర్ఫాన్ ఖాన్, ఫరీద్ ఖాన్ మంచి పని చేశారంటూ అభినందించారు.

 

Latest Updates