నిరసనకారుల నుంచి పోలీస్‌ని కాపాడిన ముస్లిం వ్యక్తి

ఫిరోజాబాద్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలలో చిక్కుకున్న ఒక పోలీసు అధికారిని ఒక వ్యక్తి తన ప్రాణాలకు తెగించి రక్షించాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో డిసెంబర్ 20న CAAకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లను అరికట్టే దశలో అక్కడ అజయ్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నాడు. నిరసనకారుల గుంపు ఒక్కసారిగా పోలీసులపై దాడులు చేశారు. ఈ దాడులలో అజయ్ కుమార్‌ తలకు, చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి కదలలేని స్థితిలో ఉన్న కుమార్‌ని హాజీ ఖాదిర్ అనే వ్యక్తి గమనించాడు. వెంటనే అక్కడికి వచ్చి కుమార్‌పై దాడిని ఆపాడు. గాయాలపాలైన కుమార్‌ని తన ఇంటికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. నిరసనకారుల అల్లర్లు అదుపులోకి వచ్చిన తర్వాత అజయ్ కుమార్‌ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో దిగబెట్టాడు.

‘హాజీ ఖాదీర్ సాహెబ్ నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నా తలకు మరియు చేతికి అయిన గాయాలకు ప్రథమ చికిత్స చేయించాడు. నా బట్టలు చినిగిపోవడంతో.. అతను నాకు ధరించడానికి బట్టలు ఇచ్చి, తాగడానికి నీళ్లు ఇచ్చాడు. మీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని నాకు హామీ ఇచ్చాడు. కొన్ని గంటల తర్వాత హాజీ నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళాడు. హాజీ ఆ సమయంలో ఒక దేవుడిలాగా వచ్పాడు. అతడు రాకపోతే నేను చనిపోయేవాడిని’ అని పోలీస్ అధికారి అజయ్ కుమార్ చెప్పాడు.

ఈ సంఘటనను గుర్తుచేసుకున్న ఖాదీర్.. ‘నిరసనకారులు అజయ్‌ని కొట్టేటప్పుడు నేను నమాజ్ చేస్తున్నాను. నిరసనకారుల దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. నేను అతనిని రక్షిస్తానని అతనికి హామీ ఇచ్చాను. ఆ సమయంలో నాకు అతని పేరు కూడా తెలియదు. నేను మానవత్వంతోనే అజయ్‌ని రక్షించాను’ అని మిస్టర్ ఖాదిర్ అన్నారు.

ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ దేశాల మైనారిటీలు మతపరమైన హింస కారణంగా డిసెంబర్ 31, 2014కు ముందు భారతదేశానికి వస్తే వారికి పౌరసత్వం ఇవ్వడానికి పౌరసత్వ చట్టం సహాయపడుతుంది.

For More News..

కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఫ్లైట్‌లో 100 మంది..

నిర్బయ తరహాలో.. బస్సులో మైనర్ బాలికపై అత్యాచారం

పది ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఒక మిల్క్ ప్యాకెట్ ఫ్రీ

Latest Updates