ఒవైసీ కోసమే ముస్లిం రిజర్వేషన్లు: లక్ష్మణ్

ఒవైసీ కోసమే ముస్లిం రిజర్వేషన్లు కావాలని సీఎం కేసీఆర్ అంటున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. తెలంగాణలో EBCలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని…వారికి రిజర్వేషన్లు అమలు చేసేలా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన అనుమతులు, హైవేల నిర్మాణానికి కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల విషయమై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు సీఎం కేసీఆర్ సిద్ధమేనా అని ప్రశ్నించారు. బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ రాజకీయ దాడికి దిగుతోందని విమర్శించారు. ఢిల్లీలో అమిత్ షా, సుష్మాస్వరాజ్, అద్వానీని కలిశామన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అమిత్ షా తమకు సూచించినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నుంచి కొంత మంది నేతలు టచ్ లో ఉన్నారని… మోడీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో  RTC ని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఐఆర్, సీపీఎస్ లను రద్దు చేశారన్నారు. తెలంగాణలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు లక్ష్మణ్.

Latest Updates