కట్నం వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తెనాలి పరిధిలోని చెంచుపేటకి చెందిన షేక్​మస్తాన్ బాషా కూతురు షేక్​ షహీన్(22)ను ఒంగోలు పరిధిలోని తోవగుంటకు చెందిన షేక్​సాజిద్(28)కి ఇచ్చి 2018లో పెళ్లి చేశారు.

భార్యభర్తలు ఇద్దరు కుత్బుల్లాపూర్ ​సీపీఆర్ ​కాలనీలో ఉంటున్నారు. షాజిద్ టైల్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్. వీరికి ఓ పాప ఉంది. పెళ్లి జరిగిన 4 నెలలు బాగానే ఉన్న సాజిద్ అనంతరం కట్నం కోసం షహీన్​ను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. పెద్దలు పంచాయితీ పెట్టి నచ్చజెప్పి పంపించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. రోజూ తాగొచ్చి వేధించేవాడు. తట్టుకోలేకపోయిన షహీన్​మంగళవారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పక్కింటి వాళ్ల సమాచారంతో షహీన్​తల్లిదండ్రులు వచ్చి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates