తన కొడుకుకి ‘మోడీ’ అని పేరు పెట్టిన ముస్లిం మహిళ

ప్రధాని నరేంద్ర మోడీ పై అభిమానంతో ఓ ముస్లిం మహిళ తన కొడుకుకి మోడీ అని పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప్రాంతానికి చెందిన మైనాజ్ బేగం అనే మహిళకు కొద్ది రోజుల క్రితం కుమారుడు పుట్టాడు. సరిగ్గా ఫలితాలు విడుదలయ్యే రోజే తన కుమారుడికి ఏ పేరు పెట్టాలని కుటుంబ సభ్యులతో సహా మైనాజ్ బేగం తీవ్రంగా ఆలోచించారు. ఫలితాల్లో మోదీ మరోసారి ప్రభంజనం సృష్టించడంతో తన కొడుకుకి ప్రధాని పేరే పెట్టాలని మైనాజ్ నిర్ణయించుకుంది.

అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అవన్ని పట్టించుకోని మైనాజ్ కొడుకుకి ‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ’గా పేరు నిర్ణయించి, ఆ తర్వాత ఆ గ్రామ పంచాయతి కార్యదర్శిని కలిసి అదే పేరుతో రిజిస్ట్రేషన్ చేయించింది.

మోదీ దేశానికి ఎంతో మంచి చేశారని, త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చారని, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని, మరుగుదొడ్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం కూడా చేశారని, అందుకే ఆయన మీద అభిమానంతో  కొడుకుకి ఆ పేరు పెట్టుకున్నానని మీనాజ్ బేగం తెలిపింది.

Latest Updates