అయోధ్యలో నిర్మించే మసీదులో హిందువులను కూడా భాగస్వాములను చేస్తాం

హైదరాబాద్ : అయోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నామన్నారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముస్లింలు. ఆలయ నిధుల సేకరణ కోసం నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. శ్రీరాముడి ఫోటోకు పూలమాలలు వేసి, హారతి ఇచ్చారు ముస్లిం మహిళలు. జై శ్రీరాం, భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. శ్రీరాముడి ఆలయం కోసం ముస్లింలు కూడా చందాలు ఇవ్వాలన్నారు ముస్లింలు. అయోధ్యలో నిర్మించే మసీదులో హిందువులను కూడా భాగస్వాములను చేస్తామని వారు చెప్పారు.

Latest Updates