వాట్సాప్, టిక్‌టాక్ వైరస్ గాళ్లు దొరికిపోయారు

కరోనా వైరస్ కొన్ని వర్గాల ప్రజలకు సోకదంటూ టిక్‌టాక్ వీడియోలు చేసినవారిని అదుపులోకి తీసుకోనున్నారు పోలీసులు. అయితే ఈ వీడియోలను ఇప్పటికే కోటిమందికిపైగా చూశారని వీటి ద్వారా ముప్పువాటిల్లిందని తెలిపారు. అయితే వీడియోలలో ముస్లింలకు కరోనాను ఎదురించే శక్తి ఉందని, ఎవరూకూడా సోషల్ డిస్టెన్స్ పాటించనవసరం లేదని ప్రభుత్వం చెప్పే రక్షణచర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం జరిగినట్లు తెలిపారు. అయితే ఈ టిక్ టాక్ వీడియోలు ముస్లిం కమ్యునిటీలోని వాట్సప్ గ్రూపులలో, ఫేస్బుక్ పేజీలలో విపరీతంగా సర్య్కులేట్ అయినట్లు చెప్పారు.  30వేలకుపైగా ఇలాంటి ఫేక్ వీడియోలను రూపొందించినట్లు చెప్పారు. ఇవి హిందీ మరియు ఉర్దూ భాషలలో ఉన్నట్లు తెలిపారు.

అయితే ఈవీడియోలు భారతదేశంలోనేకాక పాకిస్తాన్, మిడిలీస్ట్ కంట్రీస్‌లో కూడా  వ్యాప్తిచెందాయని తెలిపారు. ఈ వీడియోలలో ఎక్కువగా ఆయా వర్గాల ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించవద్దని వున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాము చేయాలనుకున్న ప్రచారం పూర్తవుతుండటంతో సదరు వీడియోలు వారి ఫేస్ బుక్ పేజీలను నుంచి డిలీట్ అవుతున్నట్లు  పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ వీడియోలను ప్రొఫేషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ సహాయంతో చేశారని చెప్పారు. అయితే ఈనకిలీ వార్తలను వ్యాప్తిచేసే ఖాతాలు పాకిస్తాన్ ఉగ్రవాదులను సపోర్ట్ చేసేవిగా ఉన్నట్లు తెలిపారు. అయితే వీటిని ఓ వర్గం వారు ఎక్కువగా చూడడానికి వాహకంగా టిక్ టాక్ ఉపయోగపడిందని చెప్పారు.

చేతులు కలపడం, సమూహాలుగా ఉండటాన్ని వ్యతిరేకించడానికి టిక్‌టాక్ వీడియోలే కారణమని చెప్పారు పోలీసులు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు వెళ్లిన డాక్టర్ల టీంపై పలువురు వ్యక్తులు దాడిచేశారని తెలిపారు. అయితే కొందరు ముస్లిం మతపెద్దలు సదరు వర్గాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని, సమూహాలకు వెళ్లాలని సూచిస్తున్నారని పోలీసులు అన్నారు. ఢిల్లీలో జరిగిన  మతప్రచారసభ తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ వీడియోలలో కూడా  సోషల్ డిస్టెన్స్ పాటించకూడదని అతను చెప్పినట్లు గుర్తించినట్లు తెలిపారు పోలీసులు.

Latest Updates