నిరంతరం ప్రజల్లో ఉంటూ ఉద్యమించాలి: మనిక్కమ్ ఠాగూర్

కాంగ్రెస్ పార్టీ కేడర్ కు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మనిక్కమ్ ఠాగూర్ సూచన

హైదరాబాద్: పార్టీ నాయకులు.. కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకం కావాలి.. వారితో కలసి క్షేత్రస్థాయి ఉద్యమాలు చేయాలని  కాంగ్రెస్ పార్టీ కేడర్ కు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మనిక్కమ్ ఠాగూర్ సూచించారు. మనమంతా టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నికలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కలిసి ఐక్యంగా పనిచేయడం చాలా ముఖ్యమన్నారు. అన్ని విషయాలు చర్చించుకునేందుకు  ప్రతి నెలలో రెండు సార్లు తప్పకుండా కొర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

నాతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడండి..  అన్ని వేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో నిరంతరం క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాలి.. నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు.. వైఫల్యాలపై ఈనెల 28న గవర్నర్ కు వినతిపత్రాన్ని అందజేయాలని సూచించారు. అలాగే అక్టోబర్ 2వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దినంగా పాటించాలి..  ఈ కార్యక్రమాలను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజయవంతం చేయాలని మనిక్కమ్ ఠాగూర్ కోరారు.

Latest Updates