శ్రీలంక నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా ముత్తయ్య మురళీధరన్

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కు అరుదైన గౌరవం దక్కింది. నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించాలని ముత్తయ్య మురళీధరన్ ను శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆహ్వానించారు. ఆయన ఆహ్వానంతో గవర్నర్ బాధ్యతలను మురళీధరన్ స్వీకరించనున్నట్లు సమాచారం.

1992 లో టెస్టు క్రికెట్ లో,1993లో వన్డే క్రికెట్ లోకి ముత్తయ్య మురళీధరన్ ప్రవేశించాడు. తన క్రికెట్ కెరీర్ లో రికార్డులను సృష్టించారు. 2010 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు మురళీధరన్.

Latest Updates