కరోనా కాలంలో జోరందుకున్న మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌

గత నెల రూ.5.6 లక్షల కొత్త ఖాతాలు
వివిధ ఫండ్స్‌‌లో రూ.89,813 కోట్లు
డెట్‌‌ఫండ్స్‌‌కు ఎక్కువ డిమాండ్

న్యూఢిల్లీ: మార్కెట్లు తరచూ ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా, మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ ఇండస్ట్రీ మాత్రం దూసుకెళ్తోంది. గత నెల కొత్తగా 5.6 లక్షల ఎంఎఫ్‌‌ అకౌంట్లు ఓపెన్‌ అయ్యాయి. దీంతో మొత్తం ఎంఎఫ్‌ ‌ఎకౌంట్‌ హోల్డర్ల సంఖ్య 9.2 కోట్లకు చేరింది. జూన్‌‌లో ఐదు లక్షల మంది ఎంఎఫ్‌‌ల ఖాతాలు తెరిచారు. అసోసియేషన్‌ ఆఫ్‌‌ మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ ఇన్‌ ఇండియా (ఏంఎంఎఫ్‌‌ఐ) లెక్కల ప్రకారం మనదేశంలో 45 మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌ హౌజ్‌‌లు ఉన్నాయి. వీటిలోని ఫోలియోల సంఖ్య జూన్‌‌లో 9.15 కోట్లు కాగా, గత నెల ఇవి 9.21కోట్లకు చేరాయి. కేవలం డెట్‌‌ఫండ్స్‌‌లోనే గత నెల నాలుగు లక్షల ఫోలియోలు చేరాయి. మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌పై జనానికి నమ్మకం పోలేదని ఈ లెక్కలను చూస్తే అరమ్థవుతుంది. మ్యూచువల్‌ ‌ఫండ్స్‌ ‌సెక్టార్‌ ఈ ఏడాది మే లో 6.13 లక్షలు, ఏప్రిల్‌‌లో 6.82 లక్షలు, మార్చిలో 9.1 లక్షల ఇన్వెస్టర్‌ ‌ఎకౌంట్లను సంపాదించింది.

మ్యూచువల్‌ ‌ఫండ్సే బెటర్‌‌…
‘‘ఈ ఏడాది మార్చిలో మార్కెట్లు బాగా నష్టపోయినా, చాలా మంది ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌‌మెంట్లు మొదలుపెట్టారు. మార్కెట్లు పడి పోతున్నప్పుడే ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ మంచిదని భావిస్తున్నారు. అందుకే మ్యూచువల్‌ ‌ఫండ్స్‌‌ మార్కెట్‌ దూసుకెళ్తున్నది. ఫోలియోలు విపరీతంగా పెరుగుతున్నాయి’’ అని మార్నింగ్‌ స్టార్‌ అనే ఫర్మ్‌ ‌కు చెందిన హిమాంశు శ్రీవాస్తవ అన్నారు. ఒక్కో ఇన్వెస్టర్‌‌ అకౌంట్‌‌కు కేటాయించే నంబరునే ఫోలియో అంటారు. అయితే ఈక్విటీ, ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ ‌ల ఫోలియోల సంఖ్య మాత్రం గత నెల కొద్దిగా తగ్గింది. డెట్‌ ‌ఆధారిత స్కీమ్‌‌ల ఫోలియోలు 4.25లక్షలు పెరిగి 68.85 లక్షలకు చేరుకున్నాయి. ఓవర్‌ ‌నైట్‌ ‌ఫండ్స్‌‌ను మినహాయిస్తే మిగతా అన్ని డెట్‌‌ఫండ్స్‌ ‌ఫోలియోలు పెరిగాయి. కార్పొరేట్‌ బాండ్స్‌‌ ఫండ్స్‌‌లో గత నెల కొత్తగా 60,269 ఫోలియోలు చేరాయి. లిక్విడ్‌ ‌ఫండ్స్‌‌లో 58,379, షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్స్‌‌ 54,002, బ్యాంకింగ్‌‌, పీఎస్‌‌యూ ఫండ్స్‌‌లో 51,626 ఫోలియోలు చేరాయి. ఇన్వెస్టర్లు మొత్తం రూ.89,813 కోట్లను వివిధ మ్యూచువల్‌ ‌ఫండ్స్‌ స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేశారు.

For More News..

పన్నులు కట్టేది 1.5కోట్ల మంది! ఐటీఆర్ వేసేది 6.5కోట్ల మంది

ఇంట్లో నలుగురు మృతి.. ఒక్కోచోట ఒక్కొక్కరి మృతదేహం

ఆపరేషన్ మేడ్చల్.. యాక్షన్ ప్లాన్ షురూ..

Latest Updates