టిక్‌టాక్‌ పోయి.. టకాటక్‌ వచ్చె..!

న్యూఢిల్లీ : ఇండియన్ ప్రభుత్వం టిక్‌‌టాక్ యాప్‌‌ను బ్యాన్ చేసిన అనంతరం ఈ యాప్‌‌కు ఆల్టర్నేటివ్‌‌గా పలు యాప్‌‌లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా టిక్‌‌టాక్‌‌ మాదిరి ఎంఎక్స్ ప్లేయర్ ‘టకాటక్’ యాప్‌‌ను లాంఛ్ చేసింది. ఇండియాలో టిక్‌‌టాక్ యాప్‌‌ ఆల్టర్నేటివ్‌‌గా దీన్ని తీసుకొచ్చింది. ఎంఎక్స్ టకాటక్ రియల్, ఫన్ వీడియోలను ఆఫర్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌పై కూడా షేర్ చేసుకోవచ్చు. డైలాగ్ డబ్బింగ్, కామెడీ, గేమింగ్, డీఐవై, ఫుడ్, స్పోర్ట్స్, మెమీస్ లాంటి పలు రకాల వీడియోలను ఈ యాప్‌‌లో బ్రౌజ్ చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌‌‌‌లో ఈ యాప్ డిస్క్రిప్షన్‌‌ ఉన్నట్టు కంపెనీ చెప్పింది.  ఈ యాప్ లో షార్ట్ వీడియోలను క్రియేట్ చేసుకోవడంతో పాటు వీడియోలకు డ్యాన్స్‌‌లు చేయడం, మూవీ డైలాగ్స్‌‌ను డబ్‌‌ చేయడం, ఫేస్‌‌బుక్‌‌, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌‌లో వాటిని సేర్ చేయడం వంటివి చేసుకోవచ్చు. వీడియోల ఎడిటింగ్‌‌ను యాప్‌‌లో ఉన్న ఎడిటింగ్ ఫీచర్స్ ద్వారా ఎఫెక్ట్‌‌లను యాడ్ చేసుకోవచ్చు.

టకాటక్ ఫీచర్లు…

ట్రెండింగ్ వీడియోలు.. ఈ యాప్‌‌లో ట్రెండింగ్ అమేజింగ్, ఫన్ వీడియోలను బ్రౌజ్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ షేర్ స్టేటస్.. 10 వేల వరకు స్టేటస్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి.  షూట్ అండ్ ఎడిట్.. యూజర్లు ఎడిటింగ్ ఫీచర్లు ద్వారా వీడియోలను క్రియేట్ చేసుకుని, ఆన్‌‌లైన్లో షేరు చేసుకోవచ్చు బ్యూటీ క్యామ్… యూజర్లు బ్యూటీ ఎఫెక్ట్‌‌లను, ఫిల్ట ర్ను ఎంపిక చేసుకుని ఎడిటింగ్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటర్….వీడియోలను కంబైన్ చేయవచ్చు. వీడియో టైమింగ్‌‌ను సెట్ చేసుకోవచ్చు. ఫోటో ఎడిటర్… మంచి మంచి ఫోటోను పిక్ చేసుకుని, మీ స్టోరీని క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్వేజస్ సపోర్ట్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలి, గుజరాతీ, మరాఠి, పంజాబీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌‌లలో ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్‌‌లో మ్యూజిక్ లైబ్రరీ కూడా ఉంది. ఇది ఫ్రెష్ ఎడిటర్ ఫిక్‌‌తో ఒక మ్యూజిక్ లైబ్రరీని అందిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates