మా నాన్నకు 27 మంది భార్యలు, 150 మంది పిల్లలు

కెనడా: తన తండ్రికి 27 మంది భార్యలు, 150 మంది పిల్లలు ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఓ టీనేజ‌ర్. ఈ విష‌యాన్ని త‌న తండ్రి ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని , అయితే చెప్పాల్సిన‌ స‌మ‌య‌మిద‌ని ఆ కుర్రాడు టిక్ టాక్ ద్వారా వెల్ల‌డించాడు. బ్రిటీష్‌ కొలంబియాకు చెందిన మెర్లిన్‌ బ్లాక్‌మోర్(19)‌ది చాలా పెద్ద కుటుంబం. మెర్లిన్‌ తండ్రి విన్‌స్టన్‌ బ్లాక్‌మోర్‌కు త‌న త‌ల్లి కాకుండా మ‌రో 26 మంది భార్యలున్నార‌ని , తన‌కు 149 మంది తోబుట్టువులు ఉన్న‌ట్టు చెప్పాడు. త‌మ కుటుంబం చాలా పెద్దదని.. త‌మ క‌జిన్స్ అంతా త‌మ త‌ల్లుల‌తో కాకుండా అందరూ కలిసి “మోటెల్ హౌస్” లో ఉండేవార‌మ‌ని, అంతా క‌లిసి స్కూల్ కు వెళ్లేవారమ‌ని చెబుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న మెర్లిన్‌కు గత మూడేళ్లుగా తండ్రి విన్‌స్టన్‌తో సంబంధాలు లేవు. అయితే తోడబుట్టిన వాళ్లతో మాత్రం ఇప్పటికీ టచ్‌లో ఉంటామ‌ని తెలిపాడు మెర్లిన్

Latest Updates