పోరాటాల గడ్డ భువనగిరి నుంచే నా పోరాటం : ఎంపీ కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి: స్థానిక సంస్థల నిధులు, విధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలంటూ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వెంకట్‌రెడ్డి భువనగిరిలో రాస్తారోకో చేపట్టారు. స్థానిక సంస్థల నిధులు విధుల కోసం పోరాటాల గడ్డ అయిన భువనగిరి నుంచి పోరాటం మొదలుపెట్టామని తెలిపారు. ఐదేండ్లుగా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలిపారు.

పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలు ప్రజా ప్రతినిధులు ఈ పోరాటo లో కలిసిరావాలని పిలుపునిచ్చారు. కేంద్రo , మైనింగ్, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు కేటాయించకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ లకు చెక్ పవర్ కలిపించి సర్పంచ్, ఉప సర్పంచ్ లకు మధ్య కొట్లాట పెట్టించిన కేసీఆర్..హరితహారంలో సర్పంచ్ లు నిర్లక్ష్యం చేస్తే వారిపై వేటు వేయడం సబాబు కాదన్నారు. భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ ఆందోళన చేస్తుండగా.. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Latest Updates