మై హ్యాపీ ప్లేస్‌ @ రానా

  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్‌ చేసిన మిహీకా

ముంబై: రానాకు కాబోయే సతీమణి తొలిసారి వాళ్ల రిలేషన్‌షిప్‌ గురించి బయటపెట్టారు. రానాపై తనకున్న ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘రోకా’ వేడుకకు సంబంధించి ఫొటోలను మిహీకా బజాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌‌ చేశారు. ‘నా ప్రియమైన రానాతో కలిసి జీవితం ప్రారంభం’, ‘మై హ్యాపీ ప్లేస్‌ @ రానా’ అని క్యాప్షన్‌ ఇచ్చి ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఈసందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. సన్నిహితులు, నెటిజన్లు లవ్లీ కపుల్‌ అంటూ కామెంట్లు పెట్టారు. రానా, మిహీకాల ‘రోకా’ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రానా, మిహీకా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

View this post on Instagram

My happy place! 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

Latest Updates