విజయారెడ్డి కేసు: నిందితుడు సురేష్ భార్య లత కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి హత్య చేసిన నిందితుడు సురేష్ భార్య లత కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్తను ఎవరో పావులా వాడుకున్నారని, తన భర్త అలాంటి వాడు కాదని ఆమె అన్నారు. అంతేకాకుండా తన భర్త చాలా అమాయకుడని ఆమె తెలిపారు. ఏ భూమి కోసమైతే తన భర్త విజయారెడ్డిని చంపాడని అంటున్నారో అసలు ఆ భూమి గురించి అతనికి ఏమీ తెలియదని ఆమె అన్నారు.
ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచే ఆ భూమి కోసం ఆయన తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం స్టార్ట్ చేశారని ఆమె అన్నారు. తాను, తన భర్త భూమి అమ్మి అప్పులు తీర్చుకోవాలని అనుకున్నామని ఆమె తెలిపారు.

Latest Updates