నా తల్లిదండ్రులు కూడా భూ నిర్వాసితులే: కేటీఆర్

my-mother-also-lost-land-in-the-mid-maaneru-project

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అజేయశక్తిగా ఎదుగుతుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తమకే పట్టం కడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం దేవుడితోనైనా తలపడే మనస్తత్వం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో TRS పార్టీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దసరా వరకు సిరిసిల్లకు సాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన కేటీఆర్  దేశం మొత్తం దీని వైపే చూస్తోందన్నారు. ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన నిర్వాసితులకు పాదాభివందనం చేస్తున్నానని… తన తల్లిదండ్రులు కూడా భూ నిర్వాసితులేనని చెప్పారు. మిడ్ మానేరు ప్రాజెక్టులో తన తల్లి కూడా భూమిని పోగొట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.

Latest Updates