నేను వోర్లి ఎమ్మెల్యే దోస్తును కానుగా..అందుకే నాఇల్లు కూల్చేశారు

మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం, బాలీవుడ్ హీరోయిన్ కంగ‌న ర‌నౌత్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది.

తాజాగా కంగ‌న రనౌత్ టైమ్స్ న్యూస్ నౌతో మాట్లాడుతూ తాను ఆదిత్య ఠాక్రే స్నేహితురాలు కానందునే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం త‌న‌ని టార్గెట్ చేసింద‌ని ఆరోపించారు.

అంతేకాదు నిర్మాత కరణ్ జోహార్, వోర్లి ఎమ్మెల్యే ఆదిత్య థాకరేకు ప్రియమైన స్నేహితుల‌న్నారు. వీరిద్దరి మధ్య స్నేహం ఎలాంటిదో ట్విట్టర్‌లో చాలా స్పష్టంగా కనబడుతుంద‌న్నారు.

అందుకే కర‌ణ్ కు ప్రత్యేక అధికారాలు లభిస్తాయ‌ని, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇళ్ల‌ను కూల్చేస్తున్నార‌ని కంగ‌న ర‌నౌత్ అన్నారు. ‌

Latest Updates