కొండచరియలు విరిగిపడి 33 మంది మృతి

myanmar-33-killed-in-landslide-in-mon

మయన్మార్ దేశంలో భారీ విషాదం జరిగింది. మోన్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచి భారీవర్షం పడుతూఉండటంతో… బండరాళ్లు వరదలో కొట్టుకొచ్చాయి. దీంతో.. దిగువ ప్రాంతాల్లో ఉంటున్న 27 ఇండ్లు మట్టి, బురదలో కూరుకుపోయాయి. కనీసం 33 మంది చనిపోయి ఉంటారని అధికారులు చెప్పారు. ఫైర్ డిపార్టుమెంట్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు.

Latest Updates