తప్పిన భారీ ప్రమాదం.. నేలని రాసుకుంటూ విమానం ల్యాండింగ్

  • విమానం ల్యాండింగ్ గేర్ ఫేయిల్
  • పైలట్ చాకచక్యంతో సేఫ్ ల్యాండింగ్

ల్యాండింగ్ గేర్ ఫేల్ అయిన విమానాన్ని జాగ్రత్తగా దించాడు ఓ పైలట్. దీంతో 89 మంది ప్రణాలు కాపాడిన వాడయ్యాడు. ఈ ఘటన మయన్మార్ లోని మండలే ఇంటర్ నేషనల్ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. విమానంలో లోపం తలెత్తడంతో ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదని.. దీంతో ముందు టైర్లు ఓపెన్ కాలేదని పైలెట్లు చెప్పారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వెనకాల ఉన్న రెండు టైర్లను ఆదారంగా చేసుకుని విమానాన్ని దించామని తెలిపారు.

ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు విమానం ముందు బాగం భూమిని తాకింది. దీంతో విమానం నుండి పొగలు వచ్చాయని  ప్రయాణికులు తెలిపారు. అయితే పైలెట్ చాకచక్యం వల్లే ప్రాణాలతో బతికి బయట పడగలిగామని ప్రయాణీకులు పైలెట్లకు ధ్యాంక్స్ చెప్పారు.

Latest Updates