నడి సముద్రంలో గూఢచారి తిమింగలం

Mystery whale found near Norway fuels Russian navy speculation
  •  సముద్ర జీవులకు గూఢచర్యం లో శిక్షణ?
  • నార్వే వద్ద బెల్టులతో కనిపించిన బెలూగా వేల్

కనుచూపు మేర అంతులేని సముద్రం. తీరం నుంచి వందల కిలోమీటర్లు లోపలకు వచ్చి రెండు బోట్లు వేటకు అనువైన ప్రదేశాన్ని చూసి అప్పుడే ఆగాయి.ఇంతలో రెండింటి మధ్య తెలుపు బెలూగా వేల్‌‌‌‌ (తిమింగలం) నీళ్ల పైకి వచ్చింది.మామూలుగానే వచ్చిందేమో అనుకున్నారు జాలర్లు. కానీ, దాని మెడకు కట్టి ఉన్నబెల్టుల్ ని చూసి జాలర్లు ఆశ్చర్యపోయారు. ఇలాంటి బెల్టుల్ని గుర్రాలతో సామగ్రిని తరలిం చడానికి వాడతారు. అంతేకాకుండా వేల్ కు రెండు పక్కల కెమెరాలు అమర్చడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. తిమింగలాన్ని మచ్చి క చేసుకునేందుకు జాలర్లు దానికి ఆహారం వేశారు. అనంతరం ఓ జాలరి సముద్రంలోకి దూకి, వేల్ మెడకు కట్టినబెల్టును తొలగించాడు. అనంతరం నార్వే ఆఫీసర్లకు సమాచారం చేరవేశారు. అక్కడికి చేరుకున్న నిపుణులు ఇది రష్యా పనేనని పేర్కొ న్నారు. బెల్టుపై సెయింట్ పీటర్స్ బర్గ్అని రాసివుందని చెప్పారు.

దీంతో ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా మళ్లీ సముద్ర జీవులతో గూఢచర్యం చేయడం మొదలుపెట్టిందనే ఆందోళనలు మొదలయ్యాయి. కోల్డ్ వార్ టైంలో సముద్రాల్లో శత్రువుల కదలికలపై నిఘా కోసం రష్యా నేవీ.. సీల్స్, డాల్ఫిన్లకు ట్రైనింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కెమెరాలు బిగించి సముద్రాల్లో వదిలేసింది. శత్రుకదలికలను పసిగట్టి అలర్ట్ అయ్యేందుకు ఇది ఆ దేశానికి బాగా ఉపయోగపడింది.1990ల్లో ఈ తరహా ట్రైనింగ్ ను క్రెమ్లిన్ నిలిపేసింది. కానీ 2017లో ఓ రష్యా చానెల్ మళ్లీ ఈ తరహా ట్రైనింగ్ ను వేల్స్, డాల్ఫిన్స్ కు ఇవ్వబోతున్నట్లు ఓ కథనాన్ని ప్రసారంచేసింది. ఆర్కిటి క్ ప్రాంతంలో మూసేసిన మూడు మిలటరీ బేస్ లను రష్యా ఇటీవల మళ్లీ తెరిచింది. ఆ తర్వాత అటువైపుగా తిరిగే ఓడల్ని కొన్ని సముద్ర జీవులు వెంబడించాయనే రిపోర్టులున్నాయి. నార్వే నాటోదళాల్లో భాగం కావడం వల్లే రష్యా సముద్రజీవుల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

 

Latest Updates