ఆరు రోజులైనా జాడలేని AN-32 యుద్ద విమానం

n-32-aircraft-are-not-available-for-six-days

ఇటానగర్​: ఐఏఎఫ్​ యుద్ధ విమానం ఏఎన్​–32 గల్లంతై ఆరు రోజులు కావొస్తున్నా దాని జాడ దొరకలేదు. 8 మంది సిబ్బంది, ఐదుగురు సైనికులతో ఉన్న విమానం ఈనెల 3న గల్లంతైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విమానం కోసం అధికారులు తీవ్రంగా వెతుకుతున్నారు. విమానాన్ని వెతికేందుకు వివిధ సంస్థల నుంచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సెన్సార్లను వాడుకుంటున్నామని ఐఏఎఫ్​ ప్రతినిధి రత్నాకర్​ సింగ్​ చెప్పారు. ఇస్రో శాటిలైట్ల సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. ప్రతికూల వాతావరణం, దట్టమైన అడవుల వల్ల గాలింపుకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక ప్రజలు, ఆర్మీ, పోలీసులు, ఐటీబీపీ సిబ్బంది శనివారం మొత్తం వెతికినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. దీనికోసం మరిన్ని హెలికాప్టర్లు, ఆర్మీ పాసింజర్​ విమానాలను మోహరించిందన్నారు. శనివారం ప్రమాదం జరిగినట్టు భావిస్తున్న జోర్హాట్​ను ఐఏఎఫ్​ చీఫ్​ ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా పరిశీలించినట్టు చెప్పారు.

Latest Updates