ఎన్ 99 మాస్క్ లు రెడీ

అహ్మదాబాద్ : కరోనా తో ఫైట్ చేస్తున్న హెల్త్ సిబ్బంది రక్షణ కోసం ఎన్ 99 మాస్క్ లు రెడీ అయ్యాయి. క్వాలిటీలో, కెపాసిటిలో ఎన్ 95 మాస్క్ ల కన్నా ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. అహ్మదాబాద్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ రీసెర్చ్ అసోసియేషన్ (ఏటీఐఆర్ఏ) వీటిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (డీఆర్డీఓ) తో కలిసి తయారు చేసింది. దేశంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన మాస్క్ లు ఇవేనని (ఏటీఐఆర్ఏ) తెలిపింది. ఎన్ 95 మాస్క్ లు డస్ట్ ను 95 శాతం శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటే ఎన్ 99 మాస్క్ లు 99 శాతం అడ్డుకుంటాయని ప్రకటించింది. ” దేశంలోనే 99 శాతం డస్ట్ ను ఫిల్టర్ చేసే మాస్క్ లు ఇవే. వీటిని తయారు చేసేందుకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి, మా సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్ నిరంతరం శ్రమించి ప్రత్యేక క్లాత్ ను డెవలప్ చేయగలిగాం ” అని (ఏటీఐఆర్ఏ) డైరెక్టర్ ప్రగ్నేష్ షా చెప్పారు. ఎన్ 99 మాస్క్ ల కోసం ప్రత్యేకమైన క్లాత్ ను వాడుతున్నారు. ఈ క్లాత్ ను (ఏటీఐఆర్ఏ) సంస్థ తయారు చేసింది. డీఆర్డీఓ కు ఇప్పటికే 3.5 లక్షల మాస్క్ ల అవసరమైన క్లాత్ అందజేసింది. మొత్తం 5 లక్షల ఎన్ 99 మాస్క్ లు తయారుచేయనున్నారు. ఈ సంక్షోభ సమయంలో డీఆర్డీఓ లాంటి సంస్థ తో కలిసి దేశం కోసం పనిచేసే అవకాశం రావటంతో సంతోషంగా ఉందని (ఏటీఐఆర్ఏ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగటంతో ఎన్ 95 మాస్క్ లు తీవ్రంగా కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకే అంతకన్నా క్వాలిటీతో ఎన్ 99 మాస్క్ లు సిద్ధం చేశారు.

Latest Updates