మహిళలతోనే దేశ ప్రగతి అని మోడీ నమ్ముతున్నారు : నిర్మల

మహిళల భాగస్వామ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని తమ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోందని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. నారీ తూ నారాయణీ… మహిళలే మహిమాణ్వితులు అని తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని చెప్పారు. దేశమంతటా తాను ఈ ప్రభుత్వం పట్ల కుల, మత, వర్గాలకు అతీతంగా మహిళల అటెన్షన్ ను చూస్తున్నానని నిర్మల చెప్పారు.

మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఆవిష్కరణలు చేసే ప్రతిభావంతులను ప్రోత్సహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వారికి ప్రోత్సాహం అందిస్తుందన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల పథకాలను దేశమంతటా అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు.

Latest Updates