టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జనవరి 12 లాస్ట్ డేట్

పదో తరగతి క్వాలిఫికేషన్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)లో గ్రూప్ పోస్టులకు అర్హులు అప్లై చేసుకోవాలని ప్రకటన ఇచ్చింది. గ్రూప్-సీ కేటగిరీలోని ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు డిసెంబరు 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నాబార్డ్ సూచించింది. ఆన్‌లైన్ ఎగ్జామ్ పెట్టి మెరిట్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపింది.

రిక్రూట్మెంట్ వివరాలు

పోస్టు: ఆఫీస్ అటెండెంట్

ఖాళీలు: 73

అర్హత: టెన్త్ పాస్

అప్లికేషన్ చివరి డేట్: 2020 జనవరి 12

ఆన్‌లైన్ ఎగ్జామ్: ఫిబ్రవరిలో

ఏజ్ లిమిట్: 2019 డిసెంబరు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుండాలి.

ఎగ్జామ్ ఇలా..

రెండు ఫేజ్‌లలో పరీక్ష ఉంటుంది. 120 మార్కులకు 120 ప్రశ్నలతో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆన్‌లైన్ పరీక్షకు 90 నిమిషాల టైం ఇస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. 150 క్వశ్చన్స్‌ 120 నిమిషాల టైం ఉంటుంది.

పూర్తి వివరాల కోసం నాబార్డ్ వెబ్‌సైట్ క్లిక్ చేయండి: https://www.nabard.org/

Latest Updates