ఇళ్లలో చోరీలు చేస్తున్న కరడుగట్టిన నేరస్థులు అరెస్ట్

హైదరాబాద్: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు బాలానగర్ ఎస్వోటి పోలీసులు. వారి వద్ద నుండి 36 తులాల బంగారు ఆభరణాలు, 36 తులాల వెండి, రెండు పిస్టల్స్,30వేల నగదు,12 సెల్ ఫోన్స్, స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా సైబరాబాద్ పరిధిలో ఏడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు నిందితులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఫేహీం అహ్మద్, మహమ్మద్ సలీన్ ఇద్దరు కరడుగట్టిన నేరస్థులను తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. నేరస్తులను అరెస్ట్ చేశామని.. అందులో గ్యాంగ్ స్టర్ పహీంను అరెస్ట్ చేశామన్నారు. అల్వాల్ లో జరిగిన దోపిడి కేసులో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా నిందితులను గుర్తించమని..వీరు ఇతర రాష్ట్రాల్లో దోపిడి చేస్తూ వస్తున్నారని… మొత్తం హైదరాబాద్ లో ఆరు కేసులున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ ముషీరాదాబాద్ కు చెందిన ఫాహీం, సలీంలను అరెస్టు చేశామని..గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ కర్ణాటకలోనూ చోరీలు చేశారన్నారు. ప్రధాన నిందితుడు గ్యాంగ్ స్టర్ ఫహీంపై ఉత్తరప్రదేశ్ లో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్ కేసులున్నాయన్నారు. దోపిడి చేసిన బంగారాన్ని పహీం ఇంట్లోనే బంగారం కరిగించే విధంగా ప్లాన్ చేసుకున్నారని..2013లో మురాడబాద్ జైల్ లో పరిచయమైన ఫహిం, సలీం జైల్ నుండి బయటకు వచ్చిన తర్వాత పగటి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని విచారణలో తేలిందన్నారు.

వీరు దేశ వ్యాప్తంగా చోరీలైన వందల కేసుల్లో నిందితులుగా ఉన్నారని.. 2013 నుండి ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా నేరాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. గ్యాంగ్ స్టర్ పహీంను పట్టుకోవడానికి వెళ్లిన పోలుసులపై కాల్పులు జరిపేవారని..నిందితుల నుండి రెండు వెపన్స్, 36 తులాల బంగారం, 36 గ్రాముల సిల్వర్, రాడో వాచ్ లు 3 , గోల్డ్ వేయింగ్ మిషన్ 1 స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న ఆరిఫ్ నేరస్తుడిని త్వరలో పట్టుకుంటామన్నారు. వీరు ఇతర రాష్ట్రాల్లో కూడా నేరాలకు పాల్పడ్డారని , దానిపై కూడా విచారణ చేస్తున్నామన్నారు సీపీ సజ్జనార్.

Latest Updates