భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త అరెస్ట్

రంగారెడ్డి: భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్తను నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాచారంలోని మల్లాపూర్ లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్న కూరపాటి భార్గవ్ అలియాస్ రామ్ స్థానికంగా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుండేవాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో ఈనెల 15న  ప్రమీల అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు భార్గవ్ పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే 15 వ తేది రాత్రి ప్రమీల గొంతు నులిమి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించానని భార్గవ్​ ఒప్పుకున్నాడు. భార్యను హత్య చేసినందుకు నిందితుడు భార్గవ్​ను రిమాండ్‌కు తరలించామని సీఐ మహేష్ తెలిపారు.

Latest Updates