జబర్దస్త్ ను వదిలేయడానికి కారణం చెప్పిన మెగా బ్రదర్

జబర్దస్త్ షో నుంచి  తాను తప్పుకోవడంపై వస్తున్న వదంతుల్ని మెగాబ్రదర్ నాగబాబు కొట్టిపారేశారు. జబర్దస్త్ ..! తెలుగురాష్టాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న షో. 2013నుంచి ప్రారంభమైన ఎంటర్ టైన్ మెంట్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఈషోకు మెగాబ్రదర్ నాగబాబు, రోజా హైలెట్ గా నిలుస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ షో నుంచి తాను తప్పుకుంటున్నట్లు నాగబాబు తేల్చి చెప్పారు. షో నుంచి తప్పుకోవడంపై రకరకాల రూమర్స్ వస్తున్నాయని, ఆ రూమర్స్ ను ఖండించేందుకు అధికారంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రెమ్యూనరేషన్ విషయంలో సదరు నిర్మాణ సంస్థతో విభేదాలు వచ్చాయని, అందుకే నాగబాబు షోనుంచి తప్పుకున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కొన్ని సైద్దాంతిక విభేదాల వల్ల అని చెబుతూనే నాన్చే ప్రయత్నం చేశారు. కాంట్రవర్సీ క్రియేట్ చేసేందుకు తాను ఇలా మాట్లాడడం లేదని చెప్పారు.

Latest Updates