బాల‌కృష్ణ కామెంట్స్‌పై నాగ‌బాబు కౌంట‌ర్

సినిమా షూటింగ్స్ మొద‌లుపెట్టే విష‌య‌మై, సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు భేటీ కావడంపై సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన‌ వ్యాఖ్యలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్‌ను సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కలిసి చర్చించిన విషయం తనకు తెలీదని, ప్రభుత్వంతో చర్చల విషయం పత్రికల్లో వార్తలు చూసి తెలుసుకున్నానని చెప్పారు. ఈ సమావేశానికి రావాలని తనను ఏ ఒక్కరూ పిలవలేదన్న బాలయ్య.. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ నోరు జారొద్దు.. అదుపులో పెట్టుకోవాలంటూ కౌంటర్ వేసాడు. ఇండస్ట్రీ బాగు కోసమే మంత్రితో సమావేశం అయ్యారని, భూములు పంచుకోవడానికి కాదని అన్నారు. భూములు పంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు బాధాకరమ‌న్నారు. త‌న వ్యాఖ్యలను బాలకృష్ణ వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదని,. బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు.

Latest Updates