నాగబాబు జడ్జిగా మరో ఎంటర్‌‌‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ షో

‘జీ తెలుగు’ చానెల్‌‌ త్వరలో మరో ఎంటర్‌‌‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ షోను ప్రసారంచేయనుంది. ‘జబర్దస్త్‌‌’ జడ్జ్‌‌ నాగబాబు, యాంకర్‌‌‌‌ అనసూయ, రవి, ప్రదీప్‌‌లతో ‘సరె.. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం (అన్నీ జరుగుతాయా ఏంటి)’ అనే కొత్త షోను ప్రారంభిస్తున్నారు. ఒకప్పుడు ‘జబర్దస్త్‌‌’లో చేసిన టీమ్‌‌ లీడర్స్‌‌ వేణు, ధన్‌‌రాజ్‌‌ వంటి కమెడియన్స్‌‌ చాలా కాలం తర్వాత ఈ షోతో మళ్లీ ఆడియెన్స్‌‌ ముందుకు రానున్నారు.

కార్తీక మాసం స్పెషల్‌‌గా ఈ ఎపిసోడ్‌‌ రాబోతుంది. ఇందులో నాగబాబు, కాటమరాయుడు సినిమాలో పవన్‌‌ కల్యాణ్‌‌ గెటప్‌‌తో అలరించనున్నాడు. యూట్యూబ్‌‌ చానెల్‌‌తో ఫేమస్‌‌ అయిన నటి హారిక ఇందులో స్పెషల్‌‌ రోల్‌‌ చేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో టీవీ షోలకు దూరంగా ఉన్న యాంకర్‌‌‌‌ ప్రదీప్‌‌ మాచిరాజు ఈ షోతోనే మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇది కార్తీక మాసం స్పెషల్‌‌ అంటూ ప్రోమోలు  చెప్తున్నాయి. కానీ, ఇది స్పెషల్‌‌ షోనా, లేక ప్రతి వారం పూర్తి స్థాయిలో ప్రసారమవుతుందా అనే విషయంపై క్లారిటీ లేదు. వచ్చే ఆదివారం ఈ షో ప్రసారమవుతుంది.

లేటెస్ట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Latest Updates