‘లవ్ స్టోరీ’ చెప్పబోతున్న చైతూ, పల్లవి

వెంకీమామ సినిమాతో తాజాగా హిట్టు కొట్టిన నాగచైతన్య… తన రాబోయో చిత్రానికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేశాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తాను, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ ను షేర్ చేశాడు. సంక్రాంతి కానుకగా శేఖర్‌ కమ్ముల టీం ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ.. దానికి సంబంధించిన పోస్ట్‌ర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి‘లవ్‌ స్టోరీ’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. “ఈ సినిమా గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి టైటిల్ లేదు” అని చైతూ పోస్ట్ చేశారు.  శేఖర్‌ కమ్ముల స్టైల్‌లో రూపొందుకుంటున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌ భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు. వచ్చే సమ్మర్‌లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.

Naga Chaitanya Sai Pallavi And Sekhar Kammula’s Love Story Movie First Look And Sankranthi Poster

Latest Updates