అశ్వథ్థామ అదిరిండు..

టాలెంట్‌ ఉన్నా సక్సెస్‌‌ రాక సతమతమవుతున్నాడు నాగశౌర్య. ఈ  సారి ఎలాగైనా ఓ సాలిడ్ హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. రమణ తేజదర్శకత్వంలో ‘అశ్వథ్థామ’ సినిమాలో నటిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్‌‌ నిర్మిస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ శుక్రవారం విడుదలయ్యింది. చాలాక్రియేటివ్‌‌గా తయారు చేసిన ఈ వీడియో ఇంటెన్సిటీతో అట్రాక్ట్ చేసేలా ఉంది. పెద్ద సిటీని చూపించారు. ఎవరో ఒకమ్మాయిని ఎత్తుకుపోవడంచూపించారు. బైక్‌‌ మీద హీరో దూసుకుపోవడం.. బిల్డింగ్స్‌‌ మీది నుంచి దూకుతూ ఎవరినో వెంటాడటం.. ఒకచోట రౌడీలను ఉతికి ఆరేయడంవంటివన్నీ చూస్తుంటే ఇదేదో మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ అనిపిస్తోంది. ప్రతి ఇంట్లో ఓ అశ్వథ్థామ ఉంటాడని, తను అశ్వథ్థామ ఫ్యామిలీ ఎమోషన్స్‌‌ ఉన్నకుర్రాడని సినిమా ప్రారంభంలోనే చెప్పారు దర్శక నిర్మాతలు. అయితే ఇక్కడ హీరో మాత్రం ఫుల్ యాక్షన్‌‌ మోడ్‌‌లో కనిపిస్తున్నాడు. మరి ఆఎమోషన్స్‌‌కి, ఈ యాక్షన్‌‌కి లింకేమిటో చూడాల్సిందే. మొత్తంగా టీజర్‌‌‌‌ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీ కోసం నాగశౌర్య మేకోవర్ అయిన తీరు కూడా బాగుంది. సినిమా కూడా అంతే బాగుంటే నాగశౌర్యకి ఈసారి హిట్టు ఖాయమే.

Latest Updates