పోలింగ్ లో ఓ మజిలీ : క్యూలో నిలబడి ఓటేసిన చై-సామ్

హైదరాబాద్ లో సెలబ్రిటీలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న మెసేజ్ ఇచ్చారు. తాము ఓటు వేసినట్టుగా ఫొటోలను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి పోలింగ్ పర్సెంటేజీ పెంచేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్ లో నాగచైతన్య, సమంత అక్కినేని జంట ఓటేశారు. నానక్ రామ్ గూడలోని ఓ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోల్ స్లిప్పులు, ఓటర్ కార్డ్ లను వెంట తీసుకొచ్చిన నాగచైతన్య, సమంత… క్యూలైన్ లో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూశారు. తమ వంతు వచ్చినప్పుడు ఓటేశారు.

Latest Updates