నాగాలాండ్ ‌లో కుక్కమాంసం విక్రయం నిషేధం

నాగాలాండ్‌ రాష్ట్రంలో కుక్కల మాంసం విక్రయం, వినియోగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విష‌యం తెలిసిందే. దిమాపూర్‌ మార్కెట్ ‌లో కుక్కలను విక్రయిస్తున్న ఫొటోలు ఇటీవ‌ల‌ సోషల్ ‌మీడియాలో వైరల్‌ కావడంతో సీరియ‌స్ అయిన‌ ప్రజలు సోషల్‌ మీడియా వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు. కుక్కలను చంపి తినకుండా నిషేధిస్తూ ఉత్తర్వులపై ముఖ్యమంత్రి సంతకం చేయాలని ప్ర‌జ‌లు రిక్వెస్ట్ చేశారు.

దీంతో క్యాబినెట్‌ శుక్రవారం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. కుక్కల వాణిజ్య దిగుమతి, విక్రయం, కుక్కల మార్కెట్లు, మాంసం విక్రయంపై(ఉడికించినది, ఉడికించనిది) నిషేధం విదిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెంజిన్‌ టోయ్‌ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని టోయ్‌ ట్విట్టర్ ‌లో అభినందిస్తూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ ఆ రాష్ట్ర సీఎం నింఫూ రియోకు ట్యాగ్‌ చేశారు.

Latest Updates