కేసీఆర్ కూసాలు కదులుతున్నాయ్ : నాగం

ప్రాజెక్టుల్లో భారీ అవినీతి

ప్లేస్ ఎక్కడైనా కేసీఆర్ తో చర్చకు నేను రెడీ

కేసీఆర్ పాపం త్వరలోనే పండుతుంది

మాజీ మంత్రి నాగం కామెంట్స్

సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి. బహిరంగ చర్చకు వస్తే.. గంటలో అవినీతి బయటపెడతా అన్నారు. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన నాగం… కాళేశ్వరం ప్రాజెక్ట్ 100 శాతం తప్పుడు డిజైన్ అన్నారు. సీఎం కేసీఆర్ కు నీటిపారుదలపై కనీసం అవగాహన లేదనీ.. అసమర్థ పాలన చేస్తున్నారని చెప్పారు. మేడిగడ్డ నుండి ప్రాజెక్ట్ డిజైన్ చేయడం కేసీఆర్ తప్పుడు నిర్ణయం అన్నారు. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రేమీ లేదని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్.. మా ఇంటికి రా.. ప్రాజెక్టులపై నేను కోచింగ్ ఇస్తా..

“కేసీఆర్ కు దమ్ము ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్, రంగారెడ్డి -పాలమూరు ప్రాజెక్ట్ పై బహిరంగ చర్చకు రావాలి. జరిగిన అవినీతిని నేను నిరూపిస్తా. లేదంటే.. ప్రగతిభవన్ కు రమ్మంటే వస్తా… లేదా ఎల్ బి స్టేడియంకు రమ్మంటే వస్తా. ప్లేస్ ఎక్కడైనా మీ ఇష్టం కేసీఆర్. ఒక్క గంటలో కేసీఆర్ అవినీతిని బయట పెడతా. కేసీఆర్.. నీకు ప్రాజెక్ట్ లపైన అవగాహన లేకపోతే మా ఇంటికి రా… శిక్షణ ఇస్తాను. కేసీఆర్, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు అవినీతి నుండి తప్పించుకోలేరు. జైల్ ఊచలు లెక్కించాల్సిందే. కేసీఆర్ కూసాలు కదులుతున్నాయి. త్వరలోనే కేసీఆర్ పాపం పండుతుంది.  హైదరాబాద్ లో డెంగీతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఫాగింగ్ చేయడం మర్చిపోయారు.  అవినీతితో పాటు  ప్రజల ఆరోగ్యం కూడా పట్టించుకోవాలి“ అన్నారు నాగం జనార్ధన్ రెడ్డి.

Latest Updates