బిగ్ బాస్ సీజన్–4 షూటింగ్ షురూ.. ఫొటోస్ షేర్ చేసిన నాగ్

హైదరాబాద్: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను బిగ్‌బాస్ షో ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. రాబోయే సీజన్ కోసం ఆడియన్స్ ఎప్పుడూ ఆత్రుతగా ఎదురు చూడటమే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. కరోనా కారణంగా ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్ ఆలస్యమవ్వొచ్చని, అసలు షో ఉండకపోవచ్చునని పలు గాసిప్స్ వినిపించాయి. అయితే వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పడింది. కొన్ని రోజుల క్రితం బిగ్‌ బాస్ షో తెలుగుకు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ వార్తలకు తెర పడింది.ఇప్పుడు బిగ్‌బాస్ షూటింగ్ మొదలైందని అఫీషియల్‌గా ప్రకటించారు.

బిగ్‌బాస్ సీజన్‌–4 షూటింగ్ స్టార్ట్‌ అయిన విషయాన్ని షో హోస్ట్‌, మన్మథుడు నాగార్జున ప్రకటించారు. షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలను అక్కినేని నాగ్ ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేశారు. ఆయన తన ఫేస్‌ను చూయించనప్పటికీ, మేకప్, ఎంట్రీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఇదిప్పుడు వైరల్ అవుతోంది. బిగ్ బాస్ షో ఫ్యాన్స్‌కు ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ‘బ్యాక్ ఆన్ ది ఫ్లోర్ విత్‌ లైట్స్, కెమెరా, యాక్షన్.. ఇది వావ్‌.. వావ్‌!!’ అని నాగ్ క్యాప్షన్‌ జత చేశారు. బిగ్‌బాస్‌ హౌస్‌ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేశారు. ఈ సీజన్‌లో హీరో తరుణ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు సమాచారం.

Latest Updates