సినీ రాజకీయం : జగన్, నాగార్జున భేటీ

హైదరాబాద్: లోటస్ పాండ్ లోని తన ఇంట్లో రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలతో భేటీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. టీడీపీ నుంచి పార్టీలోకి వస్తున్నవారికి.. ఇక్కడినుంచే.. ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. నాయకుల రాకతో.. లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ప్రాంగణంలో కొద్దిరోజులుగా హడావుడి కనిపిస్తోంది.

సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈ మధ్యాహ్నం వైఎస్ జగన్ తో ఆయన ఇంట్లో కలిశారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని నాగార్జున అన్నారు.

మహా సంకల్ప యాత్ర పూర్తిచేసిన వైఎస్ జగన్ త్వరలోనే APలో బస్సుయాత్ర మొదలు పెట్టబోతున్నారు. దీనిగురించి చర్చించినట్టు సమాచారం. గుంటూరు నుంచి లోక్ సభకు పోటీచేసే అభ్యర్థిపైనా చర్చించినట్టు తెలిసింది.

Latest Updates