బిగ్ బాస్-3 విన్నర్ పై నాగ్ ట్వీట్

బిగ్ బాస్-3 విన్నర్ శ్రీముఖే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నాగార్జున ట్వీట్ చేశాడు. ఈ రూమర్స్ నమ్మవద్దని.. అసలు ఇంకా ఫైనల్ షూటింగ్ పూర్తి కాలేదని, ఈ రోజు సాయంత్రం లైవ్‌ ప్రసారం జరుగుతుందని ట్వీట్ చేశాడు. “బిగ్‌ బాస్-3` చివరి రోజు షూటింగ్ జరుగబోతోంది. చాలా అద్భుతమైన ప్రయాణం. ఫైనల్ ఎపిసోడ్ లైవ్‌ లో ప్రసారం కాబోతోంది. సోషల్ మీడియాలో విజేత గురించి వస్తున్న వార్తలను నమ్మకండి. సాయంత్రం జరిగే లైవ్ కార్యక్రమంలో విజేత ఎవరనేది తెలుసుకోండి. అని నాగార్జున ట్వీట్ చేశాడు.

వంద రోజులుగా వినోదం అందిస్తున్న బిగ్‌ బాస్-3 కార్యక్రమం క్లైమాక్స్ కి చేరింది. ఈ రోజు (ఆదివారం)తో ఈ కార్యక్రమం పూర్తి కాబోతోంది. ఈ సీజన్‌ లో విన్నర్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకులందరిలోనూ ఏర్పడింది. సోషల్ మీడియాలో కూడా బిగ్‌బాస్-3 విన్నర్ గురించిన చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. రాహుల్ విన్నర్ అని ఒక వర్గం, శ్రీముఖి విజేత అని మరో వర్గం ప్రచారం చేస్తున్నాయి. ఈ వదంతులకు చెక్ పెడుతూ బిగ్‌బాస్-3 హోస్ట్ నాగార్జున తాజాగా ఈ ట్వీట్ చేశాడు.

Latest Updates