కాంగ్రెస్ నుంచి నగేష్ ముదిరాజ్  సస్పెన్షన్

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ ను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. గాంధీభవన్‌లో క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ కోదండరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో కమిటీ ఈ నీర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఇందిరాపార్కు దగ్గర జరిగిన ఘర్షణ నేపథ్యంలో మాజీ ఎంపీ వి.హనుమంత రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ ముదిరాజ్‌కు సంబంధించిన వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా నగేశ్‌ ముదిరాజ్‌ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. వీహెచ్‌ కూడా ఆ రోజు జరిగిన ఘటనపై లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. పార్టీ నేతలు అందించిన సమాచారాన్ని కూడా కమిటీ పరిశీలించింది. అన్ని అంశాలపై లోతుగా పరిశీలించాక నగేశ్‌ ముదిరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, పార్టీ నుంచి తనను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ నగేశ్‌ గాంధీ భవన్‌ దగ్గర నిరసనకు దిగారు. కాంగ్రెస్క్రమశిక్షణ కమిటీ హనుమంతరావుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమిటీలో ఉన్నవాళ్ళంతా హనుమంతరావు చెడ్డి దోస్తులన్న నగేశ్‌..న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానన్నారు.

Latest Updates