నాగోబాకు భక్తుల క్యూ

వైభవంగా జరుగుతున్న జాతర

ఉట్నూరు (ఇంద్రవెల్లి), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. నాగోబాను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు సహా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, జార్ఘండ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. మెస్రం వంశీయులు గోడవ్​లో సంప్రదాయ పూజలు చేస్తున్నారు. టెంపుల్ వెనుక భాగంలో భక్తులు రూపాయి బిళ్లను అతికించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తుండడంతో జాతరలో సందడి నెలకొంది. జాతర ఈ నెల 31న ముగియనుండడంతో మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, కాగజ్​నగర్ తదితర డిపోల నుంచి ఆదిలాబాద్​కు… ఆదిలాబాద్ ​నుంచి ఆయా డిపోలకు బస్సులను కేస్లాపూర్​మీదుగా నడిపిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు సహా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కేస్లాపూర్ వైపు వెళ్తున్నాయి.

Latest Updates