మాస్క్ ఫైన్ పెంచిన మహారాష్ట్ర ప్ర‌భుత్వం : సెప్టెంబ‌ర్ 14నుంచి అమ‌లు

క‌రోనా వైర‌స్ పై నిర్ల‌క్ష్యం త‌గ‌ద‌ని మ‌హ‌రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్ర‌జ‌ల్ని కోరారు. రాష్ట్రంలో వైర‌స్ విప‌రీతంగా వ్యాపిస్తున్నా కొంద‌రు మాస్క్ లు ధ‌రించ‌కుండా నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నిర్ల‌క్ష్యం వ‌ల్లే కేసులు న‌మోదవుతున్నాయ‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ లు ధ‌రించాల‌ని హోమంత్రి సూచించారు. నాగపూర్ లో మాస్క్ లు ధ‌రించ‌ని వారికి రూ.200 ఫైన్ విధిస్తున్నా ఎవరూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అందుకే ఇప్పుడు మాస్క్ ధరించకపోతే సెప్టెంబ‌ర్ 14 నుంచి రూ.500లు వ‌సూలు చేస్తున్న‌ట్లు చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకన్నా కాస్త జాగ్రత్త చర్యలు పాటించాలని కోరుతున్నట్టు చెప్పారు.

మ‌రోవైపు రాష్ట్రాన్ని పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్య‌ల్ని దేశ్ ముఖ్ స‌మ‌ర్ధించారు. గత రెండు నెలల నుండి మహారాష్ట్ర పరువు తీసే కుట్ర జరుగుతోందని, అది మనం చూడవచ్చని దేశ్ ముఖ్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Latest Updates