100కు ఫోన్ చేస్తే.. మేం ఇంట్లో దింపుతం: నాగ్‌పూర్ పోలీస్

  • రాత్రి 9 నుంచి పొద్దున 5 వరకు మహిళలకు ఫ్రీ సర్వీస్

దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒంటరిగా ఉన్న డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు అమానుషంగా రేప్ చేసి, తగులబెట్టిన ఘటనపై ప్రజలంతా ఆందోళనలు చేస్తున్నారు. ఆడబిడ్డల భద్రతపై ప్రశ్నలు తలెత్తిన ఈ సమయంలో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే 100కి పోన్ చేస్తే ఏ సాయం కావాలన్నా తాము అండగా ఉంటామని ప్రకటించారు.

MORE NEWS:

స్త్రీని భోగవస్తువులా చూడకూడదు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి

హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు 144 సెక్షన్

కైలాస దేశం: రాజు, దేవుడు నిత్యానంద.. ప్రధాని ఓ కోలీవుడ్ నటి!

ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు ఫ్రీ రైడ్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఎక్కడైనా చిక్కుకుపోయినా, ఒంటరిగా ఉన్నా మహిళలు 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఇంటి దగ్గర దింపుతారని నాగ్‌పూర్ సిటీ పోలీసులు ట్వీట్ చేశారు. పోలీసు వాహనంలోనే మహిళలను గమ్యస్థానానికి చేరుస్తామని ప్రకటించారు.

ఈ నంబర్లలో దేనికైనా ఫోన్ చేయొచ్చు: 100, 1091, 7122561102

Latest Updates