కేసీఆర్ మాట తప్పారు.. TRSకు నేనూ ఓనర్నే : నాయిని

రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి టీఆర్ఎస్ నాయకత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ గా నాయినికి త్వరలో పదవి ఇవ్వబోతున్నారన్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తన ఇచ్చిన మాట తప్పారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే… ‘ముఠా గోపాల్ ను గెలిపించుకురా… మంత్రిని చేస్తా’అని హామీ ఇచ్చారని అన్నారు. ఆ సమయంలో.. ‘నా కైనా, మా అల్లుడికి అయినా టికెట్ ఇవ్వమని ఆడిగాం. కానీ అలా జరగలేదు. ఇపుడు నాకు ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు’ అని అన్నారు నాయిని నర్సింహారెడ్డి.

రాష్ట్ర హోం శాఖ మంత్రిగా చేసి ఇపుడు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానంటే అది ఎవరికి కావాలి అని అన్నారు నాయిని నర్సింహారెడ్డి. ‘టీఆర్ఎస్ లో నేను కూడా ఓనర్ నే. కిరాయికి వచ్చినవాళ్ళు ఎప్పుడు దిగిపోతారో తెలియదు’ అని ఘాటుగా అన్నారు నాయిని.

Latest Updates