ముగిసిన నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను కుటుంబసభ్యులు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. నాయిని చితికి ఆయన కుమారుడు నిప్పుపెట్టారు. ఈ ఉదయం బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని ఇంట్లో నాయిని భౌతిక కాయానికి మంత్రులు, నేతలు, ప్రజాప్రతినిధులు, కార్మికసంఘాల నేతలు నివాళులు అర్పించారు. మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ … సహా ఇతర ప్రజా ప్రతినిధులు పాడె మోశారు.

మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అభిమానులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

Latest Updates