ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందిపై చీటింగ్ కేసు

*చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లు

* ఒక డ్రైవర్​పై కేసు 

నల్గొండ, వెలుగు: ప్రయాణికుల నుంచి చార్జీ డబ్బులు ఎక్కువ వసూలు చేసిన ముగ్గురు ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందిపై చీటింగ్​ కేసు నమోదు చేశారు. గురువారం నార్కెట్​పల్లి బస్టాండులో ప్రత్యేక బృందాలతో నల్గొండ ఎస్పీ రంగనాథ్​ బస్సుల్లో తనిఖీలు చేశారు. యాదగిరిగుట్ట డిపోకు చెందిన తాత్కాలిక కండక్టర్​ రామాంజనేయులు, ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్​ నాగేశ్వర్​రావుపై 420 కేసు పెట్టారు. ఖమ్మం డిపోకు చెందిన ఇంకో డ్రైవర్​పైనా కేసు నమోదు చేశారు. తాత్కాలిక సిబ్బంది ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులను అడిగి చార్జీల వివరాలు తెలుసుకున్నారు. దసరా సెలవులు అయిపోతున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముందని, జిల్లా మీదుగా వెళ్లే బస్సులను తనిఖీ చేయాలని పోలీసులకు సూచించారు. ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నట్టు తేలితే పోలీసులకు ప్రయాణకులు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

Latest Updates