సైబ‌ర్ కేటుగాళ్ల‌తో జాగ్ర‌త్త‌.. ఆ లింక్ ను క్లిక్ చేయొద్దు

సోష‌ల్ మీడియా వేదిక‌గా.. సైబ‌ర్ నేర‌గాళ్లు ప్రజలను కొత్త మార్గాల్లో మోసం చేస్తున్నారని అన్నారు నల్గొండ ఎస్పీ రంగ‌నాథ్ . తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల పేరుతో ఫేస్‌బుక్‌ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేయ‌డ‌మే కాకుండా.. ప్ర‌జ‌ల‌కు ఆదాయ‌పు ప‌న్ను ర‌ద్దు అవ‌తుందంటూ, అందుకోసం ఓ లింక్ ను క్లిక్ చేయాలంటూ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ఎస్పీ రంగ‌నాథ్ ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు త‌గు సూచ‌న‌లు ఇచ్చారు. సైబ‌ర్ కేటుగాళ్లు కొత్త త‌ర‌హా బ్యాంక్ మోసాల‌కు పాల్పడుతున్నార‌ని, ఇన్‌క‌మ్ టాక్స్ ర‌ద్దు అవుతుందంటూ ఓ మెసేజ్ ద్వారా లింక్ ను పంపిస్తున్నార‌ని తెలిపారు. ఆ లింక్ పై క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని , ప‌రిచ‌య‌స్తుల‌కు కూడా ఈ విష‌యాన్ని తెలియజేయాల‌ని సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ద్వారా తెలిపారు.

Nalgonda SP ranganath says that cyber criminals are deceiving people in new ways

Latest Updates