కిషన్‌‌రెడ్డిని కలిసిన నల్గొండ టీడీపీ నేతలు

nalgonda-tdp-leader-meets-union-ministe-kishan-reddy

బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు

నల్గొండ జిల్లాలో టీడీపీ కరుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ప్రాభవం మెల్లగా తగ్గుతూ వస్తోంది. బడా నాయకులంతా తలోదారి పట్టగా, చోటా మోటా లీడర్లు ఇప్పటి వరకు ఆ పార్టీనే అంటి పెట్టుకొనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముఖ్యమైన నాయకులు కొందరు టీఆర్ఎస్‌‌లో చేరగా, మరికొందరు కాంగ్రెస్‌‌లోకి జంప్‌‌ అయ్యారు. ఇంకా ఇప్పటివరకు పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలు కూడా బీజేపీలో చేరిపోయారు.

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నేతలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్లైంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్‌‌చార్జ్‌‌లు మాదగోని శ్రీనివాస్‌‌గౌడ్‌‌, పాల్వాయి రజనీకుమారి, కడారి అంజయ్య, చావ కిరణ్మయి, బాబూరావునాయక్, బండ్రు శోభా రాణి తదితరులు సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డిని కలిశారు. పార్టీలో చేరే విషయమై ఆయనతో చర్చించారు. త్వరలోనే అధికారికంగా పార్టీలో చేరుతామని చెప్పారు.

Latest Updates